దళిత హక్కుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ..

కరిమాబాద్, ఆంధ్రప్రభ ; దళిత కుల పోరాట సమితి రెండవ మహాసభ వాల్పోస్టర్ ను సీపీఐ జిల్లా కార్యాలయం తమ్మెర భవన్‌లో దళిత హక్కుల పోరాట సమితి 2వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 17, 18 తేదీలలో అబ్నుస్ ఫంక్షన్ హాల్‌లో జరగనున్న దళిత హక్కుల పోరాట సమితి 2వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
అలాగే ఏప్రిల్ 17న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దండు లక్ష్మణ్ (సీపీఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి),
సంఘీ ఎలేందర్ (దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి), జన్ను రవి (జిల్లా అధ్యక్షులు), గుండె బద్రి (సీనియర్ నాయకుడు), ఆరే రాజు,మస్కా సుదీర్, తాళ్లపల్లి జాన్ పాల్, రాచర్ల రాజేందర్, జన్ను హరిబాబు, మంద నవీన్, బాణాల మహేశ్, రాజేష్, శ్వేత ,శైలజ తదితరులు పాల్గొన్నారు.
