Poster invention | వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

Poster invention | చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మత్సవాల వాల్ పోస్టర్ ను స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 23 సోమవారం నుండి ప్రారంభం అవుతుందని, 28 శనివారము స్వామివారి కళ్యాణ మహోత్సవము ఉన్నందున స్టేషన్ ఘణపుర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి హనుమకొండ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈఓ లక్ష్మి ప్రసన్న ఆహ్వాన పత్రికను శ్రీహరి అందజేసి, వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బి. లక్ష్మీ ప్రసన్న, దేవాలయ మాజీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు , జూనియర్ అసిస్టెంట్ కె. మోహన్ ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
