ఈట్ రైట్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్…

ఈట్ రైట్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్…
ప్రజలందరూ కల్తీ లేని ఆహారం భుజించాలి
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ – 99 రోజుల కార్యాచరణ లో భాగంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఫుడ్ సేఫ్టీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుండి హెడ్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు ‘EAT RIGHT WALKస (ఆహార భద్రతపై ప్రత్యేక దినం)పై నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి, జిల్లా అధికారులు, ఎన్ ఎస్ ఎస్ కొఆర్డినెటర్, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఈట్ రైట్ ఫైట్ డీసీజ్, ఈరోజు సరైన ఆహారం ఆరోగ్య భవిష్యత్తు, ప్లే కార్డులు చేత బూని నినాదాలు చేస్తూ ప్రజలకు ఆవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది. అనంతరం హెడ్ పోస్టాఫీస్ వద్ద మానవహారం నిర్వహించి కల్తీలేని సరైన ఆహరం తీసుకొని ఆరోగ్య సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
