Poonam kaur | ఫేక్ సిక్ ఎవరు..?

Poonam kaur | ఫేక్ సిక్ ఎవరు..?

Poonam kaur | పూనమ్ కౌర్ పోస్టులతో మరోసారి వివాదం
సక్సెస్ ఫుల్ రన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్
ధురంధర్ 2పై పూనమ్ కౌర్ కామెంట్లు
ఫేక్ సిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ
పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిందా..?
వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ పోస్ట్
క్లారిటీ ఇస్తుందా పూనమ్ కౌర్?

Poonam kaur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పేరును డైరెక్ట్ గా ప్రస్తావించకుండా.. పూనమ్ కౌర్ పోస్టులు పెడుతుండడం.. దీని పై పవర్ స్టార్ (Powerstar) ఫ్యాన్స్ ఫైర్ అవుతుండడం తెలిసిందే. ఇలా గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి పూనమ్.. పవన్ ని టార్గెట్ చేసిందని మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. పూనమ్ కౌర్ ఇప్పుడు ఏమని పోస్ట్ చేసింది..?

Poonam kaur | సక్సెస్ ఫుల్ రన్ లో ఉస్తాద్..

మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) మూవీ రిలీజైంది. అలాగే. బాలీవుడ్ స్టార్ రణ్‌ వీర్ సింగ్ ధురంధర్ 2 మూవీ రిలీజైంది. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మార్చి 26న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. టాక్సిక్ మూవీ కూడా మార్చి 19నే రిలీజ్ కావాలి కానీ.. పోస్ట్ పోన్ అయ్యింది. జూన్ 4న టాక్సిక్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ఒక వారం ముందుగా మార్చి 19 రిలీజ్ చేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది.

Poonam kaur | ఫేక్ సిక్ నిలబడలేరు..

ఇదిలా ఉంటే.. జస్క్రిత్ సింగ్ రంగీ.. ద రియల్ సింగ్.. స్టోరీ ఆఫ్ రియల్ హీరో.. ధురంధర్ 2 చూసేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను. నో ఫేక్ సింగ్ వుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ బాక్సాఫీస్ అని పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. ఆమె పవన్ కళ్యాణ్‌ గురించి ప్రస్తావించలేదు కానీ.. పవన్ సినిమా, ధురంధర్ 2 ఒకే రోజు రిలీజ్ కావడంతో.. ఆమె పవన్ కళ్యాణ్‌ (Pawankalyan) గురించే ఇన్ డైరెక్ట్ గా చెప్పారని కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఆ మధ్య పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడ సిక్కు మతస్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు గెటప్ లో కనిపించారు. అందుకనే.. ఆమె ఫేక్ సిక్ అంటూ పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా ప్రస్తావించిందని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. మరి.. దీని పై పూనమ్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Leave a Reply