Polling Stations | పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఎస్పీ
Polling Stations | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్(Dr. Sangram Singh G Patil) గురువారం అచ్చంపేట సబ్ డివిజన్ పరిధిలోని అమ్రాబాద్, పదర, అచ్చంపేట, ఈగలపెంట పోలీస్ స్టేషన్లను సందర్శించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎన్నికల సరళి గురించి నామినేషన్ కేంద్రాలు(క్లస్టర్ల) వద్ద బందోబస్తు గురించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు(Polling Stations) ఎన్ని ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు.
అదేవిధంగా రౌడీషీటర్ల వివరాలు తెలుసుకొని వారి కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న విలేజ్ పోలీస్ ఆఫీసర్స్(Village Police Officer) తమతమ గ్రామాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు.
సందర్శన సమయంలో పోలీస్ స్టేషన్ పరిశుభ్రత రికార్డుల నిర్వహణ సిబ్బంది క్రమశిక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ సిబ్బందిని ప్రశంసించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

