Polling is over |జనగామలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Polling is over |జనగామలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

79.06 శాతం పోలింగ్
ఓటు వేసిన ఎనిమిదో వార్డ్ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్ట్ ను పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు నరసింహారెడ్డి

Polling is over |జనగామ, ఆంధ్రప్రభ; జనగామ మున్సిపల్ ఎన్నికలపోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్ పరిధిలో 30 వార్డులు ఉండగా ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలకు ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. జిల్లా కలెక్టర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెస్ట్ జోన్ డిసిపి రాజమండ్రి నాయక్ పోలింగ్ కేంద్రాలు శాంతి భద్రతలు పర్యవేక్షించారు. ప్రెస్టన్ గ్రౌండ్ లో ఒక వృద్ధురాలని వీల్ చైర్ లో పోలింగ్ కేంద్రానికి డీసీపీ తీసుకెళ్లడం కనిపించింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

మీడియా వారికి ఎన్నికల పాసులు ఇవ్వకపోవడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు అనుమతిని నిరాకరించారు. 23వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి డబ్బులు కొంతమందికిచ్చి మరి కొంతమందికి ఇవ్వలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల వరకు 4489 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 10.19 శాతం నమోదు అయ్యింది.11 గంటల వరకు 11674 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 26.50 శాతం నమోదు అయ్యింది. మధ్యానం 1 గంట వరకు 20545మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 46.65 శాతం నమోదు అయ్యింది.మధ్యానం 3 గంట ల వరకు 28674మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 65.10 శాతం నమోదు అయ్యింది. పోలింగ్ పూర్తి ముగిసే సమయానికి పురుషులు 16914, మహిళలు 17898, ఇతరులు 9 ఓటు వేయగా 34821 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 79.06 శాతం నమోదు అయ్యింది.

Leave a Reply