Polling | ఎన్నికలకు సర్వం సిద్ధం

Polling | ఎన్నికలకు సర్వం సిద్ధం
- పోలింగ్ బాక్స్ ల్లో అభ్యర్థుల భవితవ్యం
Polling | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. మొత్తం 14045 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 6616, పురుషులు 7429 మంది ఉన్నారు. 12 వార్డు లు ఉండగా వార్డు కౌన్సిలర్ స్థానాల కోసం అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, జనసేన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 12 వార్డు లకు 24 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.
పోలింగ్ నిర్వహణ కొరకు జోనల్ అధికారులు ముగ్గురు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తొమ్మిది మంది చొప్పున నియమించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీం లు రెండు చొప్పున, ఎంసీసీ టీం ఒకటి నియమించినట్టు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు. బూత్ లెవల్ అధికారులు 24 మంది, ఎన్నికల నిర్వహణ కొరకు 145 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


