Polling | ఎన్నికలు ప్రశాంతం

Polling | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ లో ఆదివారం సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఏసీపీ ఏ రవి కుమార్ తెలిపారు. సబ్ డివిజన్ లో ని ఆరు మండలాల్లో ఉదయం 7 గంటలకే ఆయా గ్రామాలల్లో పోలింగ్ ప్రారంభం అయ్యిందని మధ్యాహ్నం 11 గంటల వరకు 56.44 శాతం పోలింగ్ నమో దై నట్లు ఏసీపీ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడ ఎలాంటి ఘర్షణలు జరుగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
