నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయం పైన ఘనంగా పార్టీ జెండా…

నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయం పైన ఘనంగా పార్టీ జెండా…
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని సోమవారం నిర్మల్ పార్టీ కార్యాలయంలో పార్టీ స్థాపకులకు, మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ, పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ, దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన పార్టీ, క్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తన బలం పెంచుకుంది.
ఆ తర్వాతి దశల్లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీ తన సత్తాను చాటింది. అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోంది.“సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ ముందుకు సాగుతోంది. చిన్న స్థాయి నుండి ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ ప్రయాణం ప్రతి కార్యకర్తకు ప్రేరణగా నిలుస్తోంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అయ్యన్న భూమన్న, కూనింటి అంజకుమార్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మేడిశెమ్మే రాజు, సామా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు యాతాళం చిన్నారెడ్డి, నల్లా రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మాదిరే శ్రీనివాస్, ఆఫీస్ కార్యదర్శి అల్లం భాస్కర్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండాజీ శ్రవణ్, గిల్లి విజయ్, పట్టణ ఉపాధ్యక్షులు ఒడ్నాలా రాజు, బీజేపీ సీనియర్ నాయకులు ఆడెపు సుధాకర్, దశరత్ పోశెట్టి అయ్యన్న రాజేందర్ ప్రకాష్, పూదరి రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
