Polio Drops | పోలియో రహిత సమాజం కోసం..

Polio Drops | పోలియో రహిత సమాజం కోసం..

Polio Drops | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు పూనుకోవాలని.. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ రాజు అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని మూడవ వార్డు రెల్లి కాలనీ మున్సిపల్ హై స్కూల్, శారదాపురి కాలనీలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం మొదలైందని చెప్పారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి బంగారు జీవితాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమాజం నిర్మించడం మనందరి బాధత్య అని పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఇందు కోసం గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు, పౌష్టికాహారం అందచేస్తున్నారు. ప్రభుత్వాలు అందజేసే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply