POLICE | బైక్ దొంగలు ముగ్గురు అరెస్ట్…

POLICE | బైక్ దొంగలు ముగ్గురు అరెస్ట్…

POLICE | బాపట్ల క్రైమ్, ఆంధ్రప్రభ : ఖరీదైన బైకులు లక్ష్యంగా దొంగతనాలు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బాపట్ల సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆదివారం బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ద్విచక్ర వాహనాల దొంగతనం కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గగ్గ సాంబశివరావు కొత్తూరు గ్రామం గుంటూరు, దాసరి గోపిరాజు బుర్ల వారి పాలెం పేరాల, దాసరి దుర్గారావు బుర్ల వారి పాలెం పేరాల చీరాల పట్టణం చెందినవారుగా ఎస్పీ తెలిపారు. కగ్గ సాంబశివరావు లారీ డ్రైవర్ గా పని చేస్తూ చెడు వ్యసనాలకి బానిసై వచ్చే డబ్బులు సరిపోక రెండు సంవత్సరాల నుండి బైకుల దొంగతనం చేస్తున్నట్లు చెప్పారు. దొంగ తాళాలతో బాపట్ల గుంటూరు పల్నాడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలలో వరుస దొంగతనాలు చేసినట్టుగా గుర్తించామన్నారు.

నిందితుడి వద్ద 33 బైకులను స్వాధీనపరుచుకున్నామన్నారు. అన్నదమ్ములు దాసరి గోపిరాజు దుర్గారావు చీపురులో అమ్ముకొని జీవనం సాగిస్తూ వచ్చే సంపాదన సరిపోక సులభంగా అధికంగా డబ్బులు సంపాదించేందుకు గత ఆరు నెలల కాలం నుండి ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అద్దంకి పరిధిలో నాలుగు వాహనాలను దొంగిలించినట్లు వెల్లడించారు. జిల్లా సిసిఎస్ పోలీసులు జిల్లా పోలీసు యంత్రాంగం సంయుక్తంగా జిల్లాలో జరుగుతున్న ద్విచక్ర వాహన దొంగతనం కేసులను చేదించారన్నారు. ముగ్గురు నిందితులోని అదుపులోకి తీసుకొని రూ.21.20 లక్షల విలువ గల 37 ద్విచక్ర వాహనాలను స్వాధీన చేసుకోవడం జరిగిందని చెప్పారు. కేసుల పురోగతికి సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారులకు సిబ్బందికి ఎస్పి ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు.

Leave a Reply