రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలి…

రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలి…

  • ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలపాలెం వద్ద రోడ్డు భద్రత, హెల్మెట్ పై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీస్తుందన్నారు.

రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి వాహనదారుడు తన భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని వాహనం నడపాలని సూచించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ డి.చంద్రశేఖర్, ఆర్ఐ కృష్ణ, ఆర్ఎస్సై లక్ష్మణ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply