Police Station | గరిటెతో దాడి చేసి హత్య

Police Station | గరిటెతో దాడి చేసి హత్య
Police Station | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో చిన్న గొడవ ఘోర పరిణామానికి దారితీసింది. జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తున్న ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి, ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన మోఫిల్ (19), దుర్వేశ్ (16) ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి టోలీచౌకిలోని ఓ జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.
గత అర్ధరాత్రి తర్వాత వీరి మధ్య చిన్న గొడవ చెలరేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మోఫిల్, జ్యూస్ సెంటర్‌లో ఉన్న గరిటెతో దుర్వేశ్ తలపై బలంగా దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన దుర్వేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
