Police | ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు

Police | ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు

Police | అచ్చంపేట, ఆంధ్రప్రభ : గత నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా అచ్చంపేట మండలంలోని రంగాపురం–సిద్దాపూర్(Rangapuram–Siddapur) రహదారి తీవ్రంగా దెబ్బతిని, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాక ప్రమాద అవకాశం పెరిగిన విషయం కథనంలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.

ఈ వార్తను గమనించిన అచ్చంపేట పట్టణ పోలీస్ శాఖ(Police Department) తక్షణమే చర్యల్లోకి దిగింది. స్థానిక ఎస్సై సద్దాం హుస్సేన్ బృందంతో కలిసి ప్రత్యక్షంగా రహదారిని పరిశీలించారు. ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి, వాహన దారులకు హెచ్చరికగా రెడ్‌ రిబ్బన్‌(Red Ribbon)లు కట్టి, ప్రమాద సూచికల ఏర్పాటు చేసి తాత్కాలిక భద్రతా చర్యలు చేపట్టారు. “ప్రజలు ప్రమాదాలకు గురికాకూడదన్న ఉద్దేశంతో వెంటనే స్పందించామని, సమస్యను సంబంధిత శాఖలకు కూడా సమాచారం అందించాం” అని ఎస్ ఐ సద్దాం హుస్సేన్(SI Saddam Hussein) తెలిపారు.

ఆంధ్రప్రభ కథనానికి, అలాగే వెంటనే స్పందించిన పోలీసు శాఖకు వాహనదారులు, ప్రజలు అభినందనలు తెలిపారు. రహదారి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Leave a Reply