రైతులను బుజ్జగించిన పోలీసు సిబ్బంది ..

హైద్రాబాద్​, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామాలలో యూరియా కోసం రైతుల‌కు అవ‌స్థ‌లు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం రాత్రింబగళ్లు(day and night) సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి, జంగంపల్లి గ్రామాల్లో యూరియా వ‌చ్చింద‌ని తెలుసుకుని రైతులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్లిపోయారు. పెద్ద మల్లా రెడ్డి గ్రామంలో యూరియా కోసం వందలాది మంది రైతులు తరలివచ్చారు.

దీంతో వారి వెంట తెచ్చుకున్న వస్తువులను క్యూలైన్(day and night) రూపంలో కిలోమీటర్ పొడవు వరకు పెట్టారు. సీరియల్ ప్రకారం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించగా ఒక్కసారిగా సొసైటీ కార్యాలయం(society office) వైపు రైతులు దూసుకు వచ్చారు. వెంటనే సొసైటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆంజనేయులు(Si Anjaneyulu) ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పెద్ద మల్లారెడ్డి సొసైటీ వద్దకు చేరుకున్నారు.

రైతులకు కావలసిన యూరియా ఎరువులు, సిబ్బంది ఇస్తారని పోలీస్ సిబ్బంది రైతులకు బుజ్జగించారు. అయినప్పటికీ సొసైటీ కార్యాలయంలోకి చొచ్చుకపోయేందుకు ప్రయత్నించారు. ఎకరాకు(Akaraku) ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేయడంతో రైతులు(farmers) అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సరిపోయే యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్(demand) చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం చెప్పులతో భారీ క్యూ లైన్ కట్టారు.

రాజాపేట‌లో ధ‌ర్నా
హైదరాబాద్​, ఆంధ్ర‌ప్ర‌భ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండల కేంద్రంలో ఈ రోజు రైతులు, బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు యూరియా కోసం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులుకు గురి చేస్తుందని మండిప‌డ్డారు. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటి మధుసూదన్ రెడ్డి, సట్టు తిరుమలేష్, ఎర్రగొకుల జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply