Police Department | ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యం

Police Department | ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యం

  • జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

Police Department | నల్గొండ, ఆంధ్రప్రభ : 2026 సంవత్సరంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం జిల్లా ప్రజలు శాంతి, భద్రత, ఆరోగ్యం, సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా పోలీస్‌శాఖ(Police Department) తరఫున ఆకాంక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

గత సంవత్సరం జిల్లా ప్రజల సహకారంతో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ త‌దిత‌ర అంశాల్లో ప్రజల సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

నేరాల నివారణకు ముందస్తు చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు విస్తృత బందోబస్తు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై కఠిన చర్యలు, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక దాడులు, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

చట్టాన్ని గౌరవించి పోలీస్ శాఖకు సహకరించాలని, మత్తు పదార్థాలు, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శాంతియుత, సురక్షిత సమాజాన్ని నిర్మించగలమని విశ్వాసం వ్యక్తం చేస్తూ, జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటుందని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.

Leave a Reply