Police Annual Report | పోలీస్ ఉన్న‌ది ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కు….

Police Annual Report | పోలీస్ ఉన్న‌ది ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కు….

  • నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ వార్షిక నివేదిక-2025 ను వెల్లడి
  • జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

Police Annual Report | నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రజల రక్షణకు పోలీస్‌లు ఉన్నార‌ని జిల్లా యస్పి సంఘరామ్ సింగ్ అన్నారు. ఈ రోజు యస్పి కార్యలయం లో ఎర్పాటు చెసిన విలేక్రాల సమావేశంలో యస్ పి మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ వార్షిక నివేదిక(Police Annual Report) 2025ను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వెల్లడించారు. జిల్లాలో 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో స్వల్పంగా నేరాలు పెరిగాయని.

ఇందులో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు 5%, తీవ్రమైన నేరాలు 2%, దొంగతనాలు 26% తగ్గాయని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 4138 క్రిమినల్ కేసులు నమోదయాన్ని వెల్లడించారు. మహిళల భద్రత కోసం జిల్లా షీ టీమ్ పనిచేస్తుందని వీటి ద్వారా ఇప్పటివరకు 138 కేసులు రాగా వాటిలో 101 కౌన్సిలింగ్ ఇచ్చి మిగతా 37 కేసు నమోదు చేసి పరిష్కరించామని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం ద్వారా జిల్లాలో 60 మంది బాలురు, 3 బాలికలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించాము.

జిల్లాలో ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిందని వాటి నివారణకు అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో బ్లాక్ స్పాట్స్ గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం ప్రజలు పోగొట్టుకున్న 1874 మొబైల్స్ లలో CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితుల ఫోన్లను ట్రేస్ చేసి 796 ఫోన్ లను రికవరీ చేసి జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేశామ‌న్నారు. టాస్క్ ఫోర్స్ టీం(Task Force Team) ద్వారా జిల్లాలో గంజాయి అక్రమ రవాణాలను నిరోధిస్తూ ఈ సంవత్సరం 9 గంజాయి కేసులు నమోదు చేసి 1.901 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 32 మందిని అరెస్టు చేయడం జరిగింది.

Police Annual Report |

ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టంగా నిర్మూలిస్తూ ప్రభుత్వ ఇసుక పాలసీని అమలు చేస్తూ ఈ సంవత్సరం అక్రమంగా ఇసుక తరలించిన 240 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి 148 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 97,650 మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం ఉల్లంఘన చాలానాలు నమోదు చేసి 3,55,27,430 జరిమానాలు విధించడం జరిగింది. జిల్లాలో గత సంవత్సరం 145 దొంగతనాల కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం కేవలం 129 కేసులు నమోదు అయ్యాయి ఇందులో 98 కేసులను ఛేదించి 78 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది.

గతేడాది వరకు 1769 జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని.ఈ సంవత్సరం 849 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంచామని తెలిపారు .జిల్లాలో ఈ సంవత్సరం పండుగల బందోబస్తు, పెద్ద జాతరులైన దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం, సింగోటం, సిరిసనగండ్ల జాతరల బందోబస్తును పటిష్టంగా నిర్వహించామన్నారు.

ప్రజాప్రతినిధుల ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాల్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం SLBC టన్నెల్ లో మరణించిన 8 మంది మృతదేహాలు వెలికితీతలో జిల్లా పోలీస్ శాఖ నిర్వీర్యయంగా పని చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు డిఎస్పీలు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాసులు, సిఐలు అశోక్ రెడ్డి, మహేష్, నాగార్జున, కనకయ్య, ఉపేందర్ రావ్, ఆర్ఐలు జగన్, రాఘవరావు. జిల్లాలో ఉన్న అందరూ ఎస్ఐలు మరియు అధికారులు పోలీసు అధికారులు ఉన్నారు.

Leave a Reply