వరంగల్లో ఘోరం..

వరంగల్లో ఘోరం..
భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త.
వరంగల్, ఆంధ్రప్రభ : వరంగల్ 14 వ డివిజన్ ఎస్ ఆర్ నగర్లో నిన్న రాత్రి దారుణం జరిగింది. ఆటో డ్రైవర్ అబ్బరబోయిన రాజు గొడవలో తన భార్య అనిత (40)ను, తలపై రోకలిబండతో బలంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఎనుమాముల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
