Police | విజయారెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసు..

Police | విజయారెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసు..
- ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే…
Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జనవరి 30వతేదీన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడినట్లుగా తెలుస్తోంది. డిప్రెషన్ తోనే ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.
గత కొంతకాలంగా విజయారెడ్డి డిప్రెషన్ తో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు, ఇటు ఆఫీస్ లోని తోటి సిబ్బంది సైతం ధృవీకరించారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లలు ముందు నుంచి ఆమె కంట్రోల్లోనే ఉన్నారు. తల్లి ఏం చెబితే అది చేసేందుకు సిద్ధమై విజయారెడ్డితో కలిసి పిల్లలు కూడా జనవరి 30న రాత్రి హైదరాబాద్-ఘట్‌కేసర్ మార్గంలో చర్లపల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇక విజయారెడ్డి రెండో ఫోన్ వాడారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా చనిపోవడానికి వారం రోజుల ముందు కాల్‌డేటాపై కూడా సమగ్రంగా విచారణ చేపట్టామని తెలిపారు.
