PMSRI  Scam :   భళా.. అర్థ క్రీడ  Andhra Prabha SPL Story)

PMSRI  Scam :   భళా.. అర్థ క్రీడ  Andhra Prabha SPL Story)

  • పనులు సగం సగం
  •  బిల్లులు 100 %
  •  — ఆదర్శ స్యూలులో అరకొర ఆటలు
  • ఇదీ పీఎంశ్రీ  అసలు రూపం 

( అర్ధవీడు, ఆంధ్రప్రభ)

ప్రభుత్వ విద్యార్థుల సమ్మిళిత అభ్యాసనానికి పురిటి నొప్పులు  తప్పేలా లేవు. 2027 నాటికి కేంద్ర ప్రభుత్వం సాధించదలచిన పీఎంశ్రీ (PMSRI Scam )  పథక లక్ష్యానికి ఆదిలోనే హంసపాదు పడింది. ఈ లక్ష్యాల్లో భాగమైన  క్రీడా మైదానాల (Sports Fecilities Fraud )  నిర్మాణం అరకొరగా చేసి, కేటాయించిన నిధులను డ్రా చేసేయడమే  అందుకు కారణంగా ఉంది. ఇందుకు అర్థవీడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం ససాక్షిగా  నిలుస్తోంది.

PMSRI  Scam

 నూతన విద్యా విధానంలో (New Education policy)   పాఠశాలల విద్యా ప్రమాణాలు ప్రస్తుత స్థితి నుండి మరింత మెరుగు పరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని సాధనలో భాగంగా ఆదర్శంగా చూపేందుకు  దేశ వ్యాప్తంగా 14,500  పాఠశాలలను (Schools)  కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

వీటిల్లో అర్థవీడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ( జి హెచ్ ఎస్ ) ఒకటి. వీటిని 2027 నాటికి ప్రాంతీయ ఆదర్శ పాఠశాలలుగా రూపుదిద్దేందుకు పిఎంశ్రీ ( ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం ద్వారా నిధులు కేటాయిస్తోంది. వీటిని ఆధునిక మౌళిక సదుపాయల కల్పనకు ఖర్చు చేయాలి. వాటిల్లో క్రీడా మైదానాల  ఆధుణీకీకరణ ఒకటి.

PMSRI  Scam : ఏ లక్ష్యం కోసం ఈ తూట్లు

పీఎంశ్రీ కింద అర్థవీడు (Arthavedu)  జి హెచ్ ఎస్ క్రీడా మైదానంలో వాలీబాల్ (wolly ball) , ఖోఖో  (KhoKho), కబ్బాడీ (Kabbadi), లాంగ్ జంప్ (Long Jump) కోర్టులు కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తున్నాయి.  ఏ ఒక్క కోర్టు నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేదు. కనీసం రికార్డుల్లో చూపిన ఖర్చు తగ్గట్లు కనిపించదు.  కబడ్డీ కోర్ట్ ను సుమారు 50 పొడవు, 40 వెడల్పు (అడుగులు )తో నిర్మించారు. సుమారు 360 సిమెంట్ బ్రిక్స్ ఉపయోగించారు. వీటిని  చుట్టూ నేలకు అర్థ అడుగు పైకి బిగించారు. మధ్య ప్రాంతం ఖాళీగా వదిలేశారు.

దానిని ఇసుకతో పూడ్చలేదు. ఈ కారణంగా  కోర్టులో ఆడితే క్రీడా స్పూర్తి రగలడం తరువాత సంగతి. పిల్లల తలలు పగిలే, కాళ్ళు విరిగే ప్రమాదం లేకపోలేదు. వాలీ బాల్ కోర్ట్ స్థితీ అంతే. ఇక్కడ పాత పోల్స్కు రంగులు అద్దారు. సుమారు 396 సిమెంట్ బ్రిక్స్ (Cement bricks)  వాడారు. కోర్టు మధ్య బాగాన్ని ఇసుకతో నింపకుండా వదిలేశారు. ఇక్కడ ఆడినా ప్రమాదాలు తప్పవు. లాంగ్ జంప్ కోర్ట్ కు 160 బ్రిక్స్ ఉపయోగించారు.కాస్త ఇసుక పోశారు.

PMSRI  Scam

కానీ కాస్త దూరం దూకితే ఎదురు గోడకు గుద్దుకునే ప్రమాదం ఉంది. ఖోఖో  కోర్ట్ లో ఒక్క పోల్ కూడా బిగించ లేదు. కనీసం నేలను చదును కూడా చేయలేదు. దీని కోసం సుమారు 612 సిమెంట్ బ్రిక్స్ ఉపయోగించారు. ఇప్పటికిప్పుడు ఈ కోర్టులో ఆడాలంటే అడుగు కూడా పెట్టలేరు. ఇలా క్రీడా కోర్టులను అతుకుల బొంతలా అతికించినందుకు చేసిన ఖర్చు ఆడిట్ ప్రకారం  ( Ammount INR 4,00,000)అక్షరాల నాలుగు లక్షలు.

PMSRI  Scam : పిల్లల భవిష్యత్తు తాకట్టు

పీఎం శ్రీ లక్ష్యానికి అనుగుణంగా కేటాయించిన నిధుల్లో  50 కాదు కనీసం 39.43 శాతం ఖర్చు చేసినా (Students )  విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపేందుకు (Sportiveness)  చిన్న అవకాశమైనా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంతో కొంత మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తేవచ్చు అనే ఆశలు అయినా మిగిలేవి. చివరికి దింపుడు కల్లం ఆశలు కూడా లేకుండా నిర్మించారనే వేదన క్రీడాభిమానుల్లో కనిపిస్తోంది.

వారి అంచనా ప్రకారం ఈ నాలుగు కోర్టుల (Four Courts)  నిర్మాణానికి ఖర్చు చూపిన నాలుగు లక్షల్లో 24 శాతం కూడా వినియోగించ లేదంటున్నారు. అందుకు వారి పరిశీలనాత్మక అంచనా లెక్కలు ఆశ్చర్యంగొలుపుతున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి. ఈ నాలుగు కోర్టుల నిర్మాణానికి 1550 బ్రిక్స్ వాడారు.

PMSRI  Scam

అవి పాఠశాల మైదానానికి చేరంగా ఒక్కో దాని ఖరీదు రూ. 24 లు. అంటే వాటి మొత్తం Bricks Value) కొనుగోలు విలువ రూ. 37,200లు. ఉపయోగించిన సిమెంట్ 20 బస్తాలు. వీటి కొనుగోలు విలువ (Cement value) రూ. 7,040లు.  ఉపయోగించిన ఇసుక ఆరు యూనిట్లు. దీని విలువ రూ. 10,080లు. బ్రిక్స్ బిగించిన బేల్దారి కూలి (Labour Coolie) విలువ రూ. 6,400లు.  రంగుల కొనుగోలు, అద్దిన కూలి విలువ రూ. 9,200లు. మొత్తం ఖర్చు విలువ రూ. 73,920 లు. అంటే ఆడిట్లో ఖర్చు చూపిన (PMSRi valvue Rs.4lakh) రూ. నాలుగు లక్షల్లో క్రీడాభిమానులు అంచనా వ్యయం కేవలం 23.43 శాతం మాత్రమే.

దీనికి మరో 16 శాతం అంటే రూ. 60 వేలు  ఖర్చు చేసి కోర్టులను మట్టితో పూడ్చి, ఖోఖో పోల్స్ బిగించి ఉంటే ప్రభుత్వ లక్ష్యానికి చేరువయ్యేవాళ్ళమని క్రీడాభి మానులు అభిప్రాయ పడుతున్నారు.

PMSRI  Scam : ఆ నిర్మాణాలు ఆమోద యోగ్యం కాదు

జి తిరుపతి రెడ్డి, పీ ఈ టి

జి హెచ్ ఎస్ లో నిర్మించిన కబాడీ, వాలీ బాల్ క్రీడా కోర్టులు ఆడేందుకు ఆమోదయోగ్యం కాదు.  ఆట స్థలం కంటే చుట్టూ సిమెంట్ బ్రిక్స్ అర్ధ అడుగు ఎత్తు ఉండడం క్రీడాకారుల ప్రాణానికి ప్రమాదం. లేదా తల, కాళ్ళు, నడుము, చేతులు తీవ్ర గాయాల పాలయే ప్రమాదం ఉంది.

PMSRI  Scam : నిర్మాణ దశలోనే అభ్యంతరం చెప్పా

జాతీయ స్థాయి కబాడీ క్రీడాకారుడు షేక్ ఇబ్రహీం

జి హెచ్ ఎస్ లో కబాడీ కోర్టు నిర్మాణ దశలోనే అభ్యంతరం చెప్పా. క్రీడాకారులకు ప్రమాదం జరిగేలా నిర్మాణం సాగింది. నా అభ్యంతరాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆపేందుకు నా శక్తి సరిపోలేదు.

Also Read : Blind Champions :  అందరూ  అంధులే

Leave a Reply