pledge | జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పోలీసుల ప్రతిజ్ఞ

pledge | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడుతూ, ఓటరే ప్రజాస్వామ్యానికి ప్రధాన శక్తి అని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటేనని తెలిపారు.

pledge

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వినియోగం ప్రతి పౌరుని బాధ్యత అని, మంచి సమాజ నిర్మాణానికి ఓటే కీలకమని అన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందిచే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు.

pledge

“భారతదేశ పౌరుడినైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యసంప్రదాయాలను స్వేచ్ఛాయిత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ద్వారా నిలబెడతానని, మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు నారాయణ, జావేద్, ఆర్‌ఎస్‌ఐలు, సివిల్, ఎఆర్ విభాగాల సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply