కబడ్డీ టోర్నీలో సత్తా చాటిన క్రీడాకారులు
- ఇంటర్ కాలేజీయేట్ టోర్నీలో చాంపియన్లు
- సౌత్ జోన్‌కు 11 మంది ఎంపిక
( శ్రీకాకుళం, ఆంధ్రప్రభ) : నూజివీడు ట్రిపుల్ ఐటీ (Nuzvid IIIT) క్యాంపస్‌లో ఈ నెల 22, 23 తేదీలలో కబడ్డీ, ఫెన్సింగ్ క్రీడా విభాగాలో ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ (Srikakulam IIIT) బాలురు, బాలికల జట్లు చాంపియన్లుగా నిలిచాయి. ఈ ప్రతిభ ఆధారంగా, అక్టోబర్ 7న జరగబోయే సౌత్ జోన్ క్రీడలకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ తరపున ఆరుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఐఐఐటి డైరెక్టర్ కె.వి.జి.డి. బాలాజీ (K.V.G.D. Balaji) విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలక అధికారి ముని రామకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్స్ ఎం.శివరామ కృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ సి.హెచ్. వాసు, డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ జి. రవి, పీ.డీ.లు సి.హెచ్. కృష్ణంరాజు, టి.దిలీప్ పాల్గొన్నారు.

