players | విదేశీ ఆట‌గాళ్లపై గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

players | విదేశీ ఆట‌గాళ్లపై గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ విష‌యంలో విదేశీ ఆట‌గాళ్లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై భార‌త క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేలంలో అందుబాటులో ఉండి… టోర్నీ మొద‌ల‌య్యే స‌మ‌యానికి ఏదోఒక సాకు చెప్పి త‌ప్పుకోవ‌డం స‌రికాద‌ని మండి ప‌డ్డారు. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బౌలర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ లు వివిధ కార‌ణాలు చెబుతూ టోర్నీకి రావ‌డంపై ఆయ‌న ఈ విధంగా స్పందించారు.

ఫ్రాంచైజీలు వేలంలో ఎంతో వ్యూహాత్మకంగా ప్లేయర్లను ఎంచుకుంటాయని.. అయితే ప్లేయర్లు చివరి నిమిషంలో అందుబాటులో ఉండమని చెప్పడం వల్ల జట్టు ప్లాన్స్ దెబ్బ‌తింటాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్లేయర్ల పట్ల ఫ్రాంచైజీలు కఠినంగా వ్యవహరించాలని సునీల్ గవాస్కర్ సూచించారు. లేదంటే ప్ర‌తీ సీజ‌న్‌లో వారు ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తార‌న్నారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్లేయర్ల కోసం ఎంతో ఖర్చు చేస్తాయని.. వారి కుటుంబ సభ్యులు వచ్చి వారితో గడపడానికి అయ్యే ఖర్చులను కూడా భరిస్తాయని గవాస్కర్ అన్నారు. కానీ కొందరు విదేశీ ప్లేయర్లు దీనిని అలుసుగా తీసుకొని వారిష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Leave a Reply