pity mother | పథకం ప్రకారం పిల్లలకు విషమిచ్చి..

pity mother | పథకం ప్రకారం పిల్లలకు విషమిచ్చి..
- ఓ మహిళ ఆత్మహత్య!
- జ్వరం కారణంగా బతికిన బాబు
- భర్త మరణం తట్టుకోలేక ఈ ఘాతుకం
- కన్నవారు అండగా ఉన్నా కానరాని ఫలితం
- కుమార్తె కుటుంబం బుగ్గిపాలు
pity mother | కల్వకుర్తి, ఆంధ్రప్రభ : భర్త లేకపోతే బతుకలేమన్న బాధ ఆమెను వెంటాడింది!.. భవిష్యత్తు అంధకారంగా భయపెట్టింది. ఒక పథకం ప్రకారం పిల్లలకు విషమిచ్చి(Poisoning children) ఆమె ఆత్మహత్య చేసుకుంది! ఆన్లైన్లో మైలుతుత్తం అనే రసాయన పదార్థం తెప్పించి.. కేక్ లో కలిపి పిల్లలకు ఇచ్చి.. ఆమె కూడా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుమారుడు జ్వరం కారణంగా కేక్ ఎక్కువగా తినక పోవడంతో బతికి పోయాడు. భర్త మరణం తట్టుకోలేక(Unable to bear the death of her husband) ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్త మరణంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్టు గమనించి కన్నవారు ఎంతో ధైర్యం చెప్పారు. నిరంతం ఆ కుటుంబానికి తోడుగా ఆమె తమ్ముడిని కూడా ఇంటి వద్ద కాపలా పెట్టారు.
pity mother | ఓ రెండు గంటల పాటు తమ్ముడు బయటకు వెళ్లడంతో..
తండ్రి చనిపోయిన నాటి నుంచి ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక వైపు తండ్రిని కోల్పోవడం.. మరో వైపు తల్లి మనోవ్యాధితో బాధపడడం(Suffering from mental illness).. ఆ పిల్లల మనసు కలచివేసింది. వారికి అండగా తాతగారు ఉండడం.. నిరంతరం కనిపెట్టుకుని ఉన్న మామయ్య ను చూసి ధైర్యంగా బతుకుతున్నారు. కొత్త సంవత్సరం వచ్చింది. లోకమంతా పండగ చేసుకుంటున్నారు. ఈ శుభ సమయంలో అమ్మ ఇచ్చిన కేక్ ను ఎంతో ఆనందంగా తిన్నారు. ఆ కేక్‌లో విషం ఉందని ఆ పిల్లలకు తెలియదు. ఓ అరగంట తర్వాత అన్నం కూడా తిన్నారు. అంతే.. తల్లి, కుమారుడు, కుమార్తె అస్వస్థతకు గురై(Daughter fell ill) కింద పడిపోయారు. ఇంతలో బయటికెళ్ళి వచ్చిన తమ్ముడు ఈ దృశ్యాన్ని చూసి స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
pity mother | ఇదీ దుర్ఘటన!
వనపర్తి జిల్లా పెబ్బెరు గ్రామానికి చెందిన భీంశెట్టి ప్రకాశ్ భార్య భీంశెట్టి ప్రసన్న (38) ఆమె కుమార్తె మేఘన (13), కుమారుడు అశ్రీత్ రాం (15)లకు రసాయనిక పదార్థం ఇచ్చి, ఆమె కూడా తీసుకుని గురువారం ఆత్మహత్య(Suicide on Thursday) చేసుకుంది. కల్వకుర్తి పట్టణంలో బుక్ సెంటర్ నిర్వహిస్తున్న భీంశెట్టి ప్రకాష్ నెల రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. భర్త మృతి తట్టుకోలేక భార్య భీంశెట్టి ప్రసన్న మానసికంగా ఇబ్బంది పడుతున్నది. అదే పట్టణంలో ఉన్న తల్లిదండ్రులు భీంశెట్టి ప్రసన్న(Parents Bheemsetty Prasanna) పరిస్థితి గమనించి, ఆమె తమ్ముడిని తోడుగా అదే ఇంట్లో ఉంచారు. కాగా ఆమె ఆన్లైన్లో బుక్ చేసిన రసాయన పదార్థాలు ఈ నెల 30న వచ్చాయి. వాటిని భద్ర పరిచి గురువారం ఉదయం కేక్‌లో కలిపి కుమార్తె మేఘన, కుమారుడు అశ్రీత్(Daughter Meghana, son Ashrit) రాంలకు ఇచ్చింది. అనంతరం ఆమె కూడా తిన్నది. బయటకు వెళ్లిన తమ్ముడు వచ్చి చూడగా ప్రసన్న, పిల్లలు అస్వస్థతతో పడిపోవడంతో లబోదిబోమన్నాడు. చుట్టు పక్కల వారి సాయంతో వారి ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే తల్లి, కుమార్తె మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు(Medical services) అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
pity mother | కొడుకు కోలుకున్నాడు..
ఆత్మహత్యకు పాల్పడిన ప్రసన్న కుమారుడు అశ్రిత్ రాం(Son Asrit Ram) కోలుకున్నాడు. ఆశ్రిత్ రాం కు జ్వరం కారణంగా కేక్ తినలేదు. దీంతో ఆ బాలుడు శరీరంలోకి తక్కువ శాతం విషం వెళ్లడం… డాక్టర్లు సకాలంలో వైద్య సేవలు అందించడంతో బతికాడు. ప్రస్తుతానికి ఆ బాలుడు కోలుకుంటున్నాడు.
