మానసిక ఉల్లాసానికి ఫిజియోథెరపీ

మానసిక ఉల్లాసానికి ఫిజియోథెరపీ
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మానసిక ఉల్లాసానికి ఫిజుయోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని మండల విద్యాశాఖ అధికారి రాజకంగారెడ్డి చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన 9 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు వైద్యులు నవీన్ సాయి చేశారు.
అనంతరం మండల విద్యాధికారి మాట్లాడుతూ.. ఫిజియోథెరపీ చేయడం వల్ల మానసిక ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ప్రతి మంగళవారం, గురువారం ఈ చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యాదగిరి, వెంకటేశ్వర్ , పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భవాని , ఐఆర్పీ మహేందర్, కంప్యూటర్ ఆపరేటర్ సంపత్, కేర్ గివర్ సునీత , తల్లిదండ్రులు కిషన్, రుక్మిణి, బిక్షపతి పాల్గొన్నారు.
