ఘనంగా కొలనుపాకలో పూలే జయంతి

ఆలేరు, ఆంధ్రప్రభ : మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ నాయకులు గడ్డం నాగరాజు, బల్లేపు సంపత్ కుమార్,కొంగరి వెంకటేష్, పరస బంగారయ్య, గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గంగుల, మాజీ కోపరేటివ్ డైరెక్టర్ ఆరె మల్లేష్,మాజీ ఎంపిటిసి మామిడాల అంజయ్య, వార్డు మెంబర్ బొంకూరి మల్లయ్య, తీరాల శంకర్,చాడ రాజు, ఎదునూరి భాస్కర్ ,మామిడాల భానుచందర్, మామిడాల కిరణ్ పాల్గొన్నారు.
