Phone tapping | సిట్ విచారణకు హాజరైన సంతోష్‌రావు

Phone tapping | సిట్ విచారణకు హాజరైన సంతోష్‌రావు

Phone tapping | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఇప్పటికే సిట్‌ విచారించి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సోమవారం నోటీసులు జారీ చేశారు. దీంతో సంతోష్‌రావు ఇవాళ విచారణకు హాజరయ్యారు.

Leave a Reply