Petrol Pumps | ఆ వార్తను నమ్మొద్దు… డీలర్స్ అసోసియేషన్

Petrol Pumps |ఆ వార్తను నమ్మొద్దు… డీలర్స్ అసోసియేషన్

Petrol Pumps | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇటీవల పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభ్యం కాకపోవడంపై వస్తున్న వార్తలను ఖండించింది. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సంస్థల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులోనే ఉందని, ఎటువంటి కొరత లేదని పేర్కొంది.

అయితే, కొన్నిచోట్ల అధిక రద్దీ కారణంగా తాత్కాలికంగా ఇంధనం అందుబాటులో లేకపోవచ్చని, దీన్ని కొరతగా భావించవద్దని సూచించింది. పుకార్ల ప్రభావంతో వినియోగదారులు భారీగా బంకుల వద్దకు రావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. ఇంధనం దొరకదన్న భయంతో ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడం వల్లే సమస్యలు వస్తున్నాయని పేర్కొంటూ, ప్రజలు అపోహలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

Leave a Reply