Perni Nani | అధికారులపై బెదిరింపులు

Perni Nani | అధికారులపై బెదిరింపులు

Perni Nani | ఆంధ్రప్రభ, వెబె డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు చర్య తీసుకున్నారు.

అధికారులు నిన్న అక్కడి అక్రమ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారు. దీనికి ప్రతికూలంగా స్పందించి, పేర్ని నాని తన అనుచరులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేర్ని నాని, ఆయన అనుచరులు అధికారులను తీవ్రంగా బెదిరించారు. దీంతో పోలీసు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply