పెరిక కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి..

పెరిక కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి..

కడెం, ఆంధ్రప్రభః పెరిక పురగిరి క్షత్రియ కులస్తులు అందరు ఐక్యంగా ఉండి సంఘం అభివృద్ధికి పాటుపడుతూ అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర పెరిక పురగిరి క్షత్రియ కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ గ టిక.విజయ్ కుమార్ అన్నారు. కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో గల పవనసుత రైస్ మిల్ వద్ద జరిగిన నిర్మల్ జిల్లా పెరిక పురగిరి క్షత్రియ కుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చుంచు భూమన్న అధ్యక్షతన జరిగింది.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి విజయకుమార్ హైదరాబాద్ లోని బీసీ కులాల స్థలాలలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ కులాల వారికి కులాలవారీగా నిధులు రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పెరిక కులస్తుల అభివృద్ధికి కోకాపేట బిల్డింగ్ హాస్టల్ వసతులు కల్పించి పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఉత్సహిస్తున్నామన్నారు.


పెరిక కుల బాంధవులందరూ ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యమ్ లింగన్న వసతి గృహాల అధ్యక్షులు డాక్టర్ డి వెంకటేశ్వర్లు అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ కోశాధికారి ఎస్ లింగన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్ల వేణుగోపాల్ b కార్యనిర్వాహక సంయుక్త కార్యదర్శి కే విజయ్ కుమార్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బొడ్డు బుచ్చన్న రాష్ట్ర నాయకులు లాసెట్టి శేఖర్ కడెం దస్తురాబాద్ ఖానాపూర్ మండలాల అధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్ లాసెట్టి శ్రీనివాస్ నిర్మల్ జిల్లాలో నుండి వివిధ మండలాల నుండి గ్రామాల నుండి వచ్చిన పెరిక కుల సంఘము నాయకులు కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply