బీఆర్ఎస్ వెంట ప్రజలు నిలబడ్డారు…

  • ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకుంది..
  • మండలానికో సామంత ఎమ్మెల్యేను పెట్టుకున్నారు.
  • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : అసెంబ్లీ ఎన్నికల్లో తనని గెలిపిస్తే బెల్లంపల్లిలో స్థానికంగా ఇల్లు నిర్మించుకుని ఇక్కడే ఉంటానని ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ విషయాన్ని విస్మరించారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ల కు శుక్రవారం బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే వినోద్ మండలానికొక సామంత ఎమ్మెల్యేని పెట్టుకుని పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తూ బెదిరిస్తూ… ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుర్గం చిన్నయ్య ఆరోపించారు.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాయిజం చేస్తూ ప్రజలను భయపెట్టి, మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పరచకుండా, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత సర్పంచ్ ఎన్నికల్లో రుజువైందని అందుకే బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధులను ప్రజలు ఓడించారని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దందాలకు విసుగు చెందిన ప్రజలునియోజకవర్గం లో బీ ఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్లో 26 సర్పంచ్ స్థానలను గెలిపించడం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందన్నారు.

రానున్న ఎంపీ టీ సీ,జెడ్పిటీ సీ ఎం పీ టీ సీ ఎన్నికల్లో ప్రజలు బీ ఆర్ఎస్ పార్టీ ని గెలిపిస్తే రావాల్సిన హక్కులు అమలు కావలసిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వంపై పోరాడి ప్రజలకు ఇప్పిస్తామని అన్నారు. ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ చేపట్టే పోరాటాలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంసిద్ధం కావాలని ఎందుకు ప్రజలను సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి నిన్నెలా వేమనపల్లి కాసిపేట తాండూర్ కన్నెపల్లి భీమిని తదితర మండలాల్లో సర్పంచులుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అభ్యర్థులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సాగర్ గౌడ్, ఇబ్రహీం లతోపాటు నిన్నెలా భీమిని కన్నెపల్లి వేమనపల్లి కాసిపేట తాండూర్ బెల్లంపల్లి మండలం చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply