భయాందోళనలో ప్రజలు

  • ముగ్గురు చిన్నారులపై కుక్కల దాడి.
  • పట్టించుకోని అధికారులు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్(Ootkur) మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ పలువురిపై దాడి చేసి గాయపరుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో కుక్కలు ప్రజలు, పశువులపై దాడి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ రోజు ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీనివాస కాలనీ(Srinivasa Colony, బుడగ జంగం కాలనీలో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇంటి ముందు ఆడుకుంటున్ననక్క విశ్వ అద్విత్(Nakka Vishwa Advit), బుడగ జంగం రవి రాకేష్‌తో పాటు పలువురు చిన్నారులపై కుక్కలు దాడి చేసి గాయపరిచినట్లు బాధితుల తల్లిదండ్రులు విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ రాత్రివేళ ప్రజలను నిద్రాహారాలు లేకుండా చేయడంతో పాటు దాడి చేసి గాయపరచడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గాయపడిన ముగ్గురు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో చికిత్సలు చేయించినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు(Officials) వెంటనే స్పందించి కుక్కల నుండి కాపాడాలని కోరుతున్నారు.

Leave a Reply