ఆదరించండి… అభివృద్ధి చేస్తా

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా పెంటల స్వప్న వెంకటేష్ గౌడ్ భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ఆదివారం ఉదయం సాయి నగర్ కాలనీలో తన అనుచరులు, స్థానికులతో కలిసి గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, వార్డు ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతిదానిపై బాధ్యతగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి, పారదర్శక పాలన కోసం ఏసీ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాత, నాగరాణి, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి సత్యనారాయణ, బంటి, నిహారిక, శ్రీనివాస్, నితిన్ గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
