Peddi Vs Lenin | అసలు ఏం జరుగుతోంది..?

Peddi Vs Lenin | అసలు ఏం జరుగుతోంది..?

Peddi Vs Lenin | నిరాశలో అభిమానులు
జూన్ 26న పెద్ది..?

Peddi Vs Lenin | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ ఓ సస్పెన్స్ సినిమాల మారింది. మార్చి 27న రిలీజ్ అని ప్రకటించారు. ఆతర్వాత ఏప్రిల్ 30న విడుదల కానుందని అనౌన్స్ చేశారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో కూడా ఏప్రిల్ 30న వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు పెద్ది విడుదల తేదీ మారిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. పెద్ది లెనిన్ కి షాక్ ఇచ్చాడని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఏమైంది..?

Peddi Vs Lenin | నిరాశలో అభిమానులు..

పెద్ది సినిమా రిలీజ్ డేట్ మారినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులకు మంచి క్వాలిటీతో సినిమా అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. కొత్త విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వార్త వైరల్ అవుతూ, సినిమా పై ఆసక్తిని మరింతగా పెంచేసింది. అయితే.. పెద్ది సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా, రిలీజ్ డేట్ మారడం వల్ల అభిమానుల్లో కొంత నిరాశ ఏర్పడింది అనేది వాస్తవం.

Peddi Vs Lenin

Peddi Vs Lenin | జూన్ 26న పెద్ది..?

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది ఏకంగా జూన్ 26కి పోస్ట్ పోన్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. చెన్నై లవ్ స్టోరీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. పెద్ది విడుదల జూన్ 26 ఉంటుందని చెప్పడం అందరినీ షాక్ కు గురి చేసింది. పెద్ది కోసమని లెనిన్ సినిమాని జూన్ 26కు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు పెద్ది మళ్లీ వాయిదాపడితే.. కొత్త డేట్ లెనిన్ డేట్ అంటే జూన్ 26కి ఫిక్స్ చేస్తే.. అప్పుడు లెనిన్ ఏం చేస్తుంది..? మళ్లీ పోస్ట్ పోన్ చేస్తుందా..? ఇప్పుడు ఇదే.. అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో దీని గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా.. పెద్ది పోస్ట్ పోన్ అవ్వడం లెనిన్ కి షాకే. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Peddi Vs Lenin

Leave a Reply