Peddi | వస్తుందా..? వాయిదా పడనుందా..?

Peddi | వస్తుందా..? వాయిదా పడనుందా..?
Peddi | పెద్ది రిలీజ్ ఎందుకు వాయిదా పడుతోంది?
నిఖిల్ స్వయంభు పోటీకి సిద్ధమా?
ఏప్రిల్ 30న ఏ సినిమా రిలీజ్ అవుతుంది?
Peddi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది. బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న పెద్ది మార్చి 27న రిలీజ్ కావాలి.. పోస్ట్ పోన్ అయ్యింది. ఏప్రిల్ 30న పెద్ది వస్తుందని ప్రకటించారు. అయితే.. మరోసారి పెద్ది పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ అని అనౌన్స్ చేసినా.. వాయిదా అనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు నిఖిల్ స్వయంభు అంటూ పోటీకి సై అంటున్నాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఏం జరగనుంది..?
Peddi | పెద్ది మరోసారి వాయిదా..?

పెద్ది సినిమా కోసం ఇంకా ఐటం సాంగ్ షూట్ చేయాలి. ప్యాచ్ వర్క్, రీ రికార్డింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. అందుచేత ఎంత ఫాస్ట్ గా వర్క్ చేసినా.. డే అండ్ నైట్ వర్క్ చేసినా.. పెద్ది సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ అవ్వడం అనేది సాధ్యం కాదనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. పైగా ఇది పాన్ ఇండియా మూవీ.. నార్త్ లో భారీగా ప్రమోట్ చేయాలి. అందుచేత.. హడావిడిగా రిలీజ్ చేయడం కంటే.. టైమ్ తీసుకుని బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. అందుచేత పెద్ది మరోసారి వాయిదా పడడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.
Peddi | పెద్ది డేట్ కి స్వయంభు రిలీజ్..?

ఇక నిఖిల్ స్వయంభు విషయానికి వస్తే.. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న సినిమా ఇది. ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కుదరలేదు. ఆతర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ డేట్ కి అడివి శేష్ డెకాయిట్ రిలీజ్ అవుతుంది. దీంతో నిఖిల్ స్వయంభు సినిమాని ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే.. నిఖిల్ సైలెంట్ గానే ఉన్నాడు తప్పా.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. కారణం ఏంటంటే.. చరణ్ తీసుకునే నిర్ణయం గురించి వెయిట్ చేస్తున్నాడట. పెద్ది పోస్ట్ పోన్ అయితే.. ఆ డేట్ కి స్వయంభు విడుదల చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. దీంతో ఏప్రిల్ 30న ఏ సినిమా వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

