Peddapalli | జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

Peddapalli | జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

టీయుడబ్ల్యూజె ఐజెయు ఆద్వర్యంలో ధర్నా


Peddapalli | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యూజే ఐజెయు జిల్లా శాఖ ఆద్వర్యంలో శనివారం పెద్దపల్లి (Peddapalli) బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన మహా ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు.

జర్నలిస్టులకు (Journalists) తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, వృత్తి కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 3న హైదారాబాద్ మాసాబ్ ట్యాంక్ రాష్ట్ర సమాచార కమీషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10గంటలకు జరిగే మహాధర్నా (Mahadharna) కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల నాయకులు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని యూనియన్ రాష్ర్ట ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షులు వంశీ విధ్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్, రాష్ర్ట కౌల్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్ గౌడ్, టికె శ్రీనివాస్, రాష్ట్ర మఫిషియల్ కమిటీ సభ్యులు సామల హరికృష్ణ, జిల్లా నాయకులు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply