Bikkanoor | న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం….

Bikkanoor | న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం….
Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో చర్చించడం జరుగుతుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పారు. శనివారం రాష్ట్ర బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బిక్కనూర్ మండలం మాజీ జెడ్పిటిసి నంద రమేష్ (Nanda Ramesh) ఆయనను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు (lawyers) ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు .ఇప్పటికే న్యాయవాదుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయవాదులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు.
