ఈరోజు ఆర్సీబీతో మల్లన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దంచేస్తుంది. టాస్ ఓడి తమ సొంత మైదానంలో తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్.. 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు బాదింది.
4.2 వ ఓవర్లో కృణాల్ పాండ్య బౌలింగ్ లో బౌండరీలతో చెలరేగిన ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ప్రభమన్ సింగ్ (16 బంతుల్లో 33) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) ఉన్నారు.