PBKS vs CSK | క్లాష్ ఆఫ్ కింగ్స్.. టాస్ గెలిచిన పంజాబ్ !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో నేడు డ‌బుల్ హెడ‌ర్ లో భాగంగా.. పంజాబ్ వేదిక‌గా మ‌రో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ముల్లన్పూర్ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్… ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఆ త‌రువాతి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో పంజాబ్ జ‌ట్టు నేటి మ్యాచ్ లో తిరిగి విజ‌యాల బాట‌లో అడుగులు వేయాల‌ని చూస్తోంది.

మరోవైపు, చెన్నై జట్టు ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. ఈ టోర్నమెంట్‌లో తిరిగి విజయం సాధించాలని చూస్తోంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ టోర్నీల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ – పంజాబ్ కింగ్స్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 30 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 30 మ్యాచ్‌ల్లో సిఎస్‌కె జట్టు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా పంజాబ్ జట్టు 14 సార్లు గెలిచింది. కానీ గ‌త 10 మ్యాచుల్లో మాత్రం పంజాబ్ జ‌ట్టుదే పైచేయి కనిపిస్తోంది. పంజాబ్ జ‌ట్టు గ‌త 10 మ్యాచుల్లో 6 విజ‌యాలు సాధించ‌గా.. చెన్నై జ‌ట్టు 4 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. మరి నేటి మ్యాచ్‌తో ఏ జట్టు తమ ఫేట్‌ని మారుస్తుందో వేచి చూడాల్సిందే.

తుది జ‌ట్లు :

చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, MS ధోని (వికెట్ కీప‌ర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ

పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *