‘OG’లో మరో హాట్ బ్యూటీ..!

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో, యువ నటీమణులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నేహా శెట్టి ఒకరు. ఆకాశ్ పూరి ‘మెహబూబా’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన నేహా, ‘డీజే టిల్లు’ సినిమాలోని ‘రాధిక’ పాత్రతో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ పాత్ర ఆమె కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు, ఆమె మరో పెద్ద అవకాశాన్ని దక్కించుకుంది.

ఇది ఇలా ఉండ‌గా.. తాజాగా జరిగిన ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న నేహా.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘OG’లో భాగం అయినట్లుగా అధికారికంగా ధృవీకరించింది. పవన్‌తో కలిసి ఒక సర్‌ప్రైజ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నానని ఆమె చెప్పింది. అయితే అది స్పెషల్ సాంగ్ లోనా..? లేక సినిమాలో చిన్న కానీ క్రేజీ రోల్ లోనా..? అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ ఏదైనా అభిమానులకు మస్త్ సర్‌ప్రైజ్ అవుతుందని హింట్ ఇచ్చింది. చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Leave a Reply