Pattabhi Sitaramayya | ఆయన జీవితం ఆదర్శం

Pattabhi Sitaramayya | ఆయన జీవితం ఆదర్శం
Pattabhi Sitaramayya | సీతారామయ్య పోరాటం అచంచలం.
Pattabhi Sitaramayya| మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవితం నవతరానికి ఆదర్శప్రాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
పట్టాభిసీతారామయ్య 146వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో వారి విగ్రహానికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో సీతారామయ్య పోరాటం అచంచలం. స్వాతంత్ర్య అనంతరం జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పని చేశారు.

భారత ప్రధాని పదవికి అత్యధిక ఓట్లు వచ్చినప్పటికీ గాంధీ కోరిక మేరకు ఆ పదవిని వదులుకున్నారు. ఆంధ్రా బ్యాంకు, కో-ఆపరేటివ్ సంస్థలను ఏర్పాటు చేసి పేదలకు తోడుగా నిలిచారు.
Pattabhi Sitaramayya | పట్టాభి సీతారామయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము
Pattabhi Sitaramayya అటువంటి మహనీయుని ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. అంతటి మహనీయునికి స్మారక భవనం నిర్మాణానికి యూనియన్ బ్యాంకు నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చినప్పటికీ.. స్థలం కేటాయింపుకు కౌన్సిల్లో తీర్మానం చేయనీయకుండా పేర్ని నాని అడ్డుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అడ్డుకున్నా స్మారక భవనాన్ని నిర్మించి తీరుతాం. పట్టాభి సీతారామయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబాప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ToRead Please Click Here చీరల పంపిణీ..
