ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం…

ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం…
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ గద్దె వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జెండాను ఆవిష్కరించి, పార్టీ సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు.
దేశ అభివృద్ధిలో బీజేపీ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పాత్రను నాయకులు కొనియాడుతూ… ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ మల్లికార్జున్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, బిజేవైయం మండల అధ్యక్షుడు గణేష్, శక్తి కేంద్ర ఇంచార్జ్ పొల్కం నవీన్, చింత ప్రవీణ్, బోగ రామస్వామి, శ్రీ రాముల శ్రవణ్ కుమార్, మనోహర్, రాజేంధర్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.
