టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌ తిరువూరు వైసీపీ నాయ‌కులు..

టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌ తిరువూరు వైసీపీ నాయ‌కులు..

ప‌సుపు కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజయవాడ,ఆంధ్రప్రభః తిరువూరు టిడిపి టౌన్ అధ్య‌క్షుడు మ‌ల్లెల శ్రీనివాస‌రావు ఆధ్వ‌ర్యంలో తిరువూరు ప‌ట్ట‌ణానికి చెందిన వైసిపి రాష్ట్ర బిసి సెల్ కార్య‌ద‌ర్శి రామ‌డుగు రామ‌కోట చారి (ఆర్.ఆర్.కె. చారి), గీతం స్కూల్ క‌ర‌స్పాండెంట్ గీత‌మ్స్ చారి ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బుధవారం ఈ చేరిక‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఎంపీ కేశినేని శివ‌నాథ్ వారికి ప‌సుపు కండువాలు క‌ప్పి సాద‌రంగా పార్టీలో ఆహ్వానించారు. పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని సూచించారు.


ఈ కార్య‌క్ర‌మంలో తిరువూరు టిడిపి టౌన్ అధ్య‌క్షుడు మ‌ల్లెల శ్రీనివాస‌రావు, బిసి సెల్ నాయ‌కులు కందిమ‌ళ్ల శేష‌గిరిరావు, టిడిపి నాయ‌కులు మాద‌ల హ‌రిచ‌ర‌ణ్ (కిట్టు), మోదుగ వెంక‌టేశ్వ‌ర‌రావు, యండ్రాతి కిర‌ణ్, తూళ్లురి అనిల్, తాళ్లూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, చిన్న జ‌మ‌ల‌య్య‌, షేక్ హుస్సెన్, షేక్ ఉమ‌ర్, కందిమ‌ళ్ల సాయి సునీల్, టిడిపి మ‌హిళ నాయ‌కులు మాధ‌వి ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Party additions

Leave a Reply