part2trend | మారుతి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు..

part2trend | మారుతి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు..
part2trend ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో.. పెద్ద విజయం సాధించి సంచలనం సృష్టించాడు డైరెక్టర్ మారుతి. ఆతర్వాత ఆ సినిమా ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. మారుతి అయితే.. వరుసగా యూత్ ఫుల్ మూవీస్ అందించి వరుసగా సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజాసాబ్ అంటూ హర్రర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి జనవరి 9న ది రాజాసాబ్ భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి.. మారుతి నెక్ట్స్ ఏంటి..?
part2trend |ప్రభాస్ ఫస్ట్ టైమ్..
ఈరోజుల్లో.. సినిమాతో దర్శకుడుగా పరిచయమైన మారుతి.. ఆతర్వాత బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్.. ఇలా యూత్ ఫుల్ కంటెంట్ తో సక్సెస్ సాధించి ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్ తో రాజాసాబ్ మూవీ చేస్తుండడం విశేషం. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. అలాగే ప్రభాస్ ఫస్ట్ టైమ్.. హర్రర్ జోనర్ లో సినిమా చేస్తుండడం.. ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో.. ది రాజాసాబ్ మూవీ భారీ విజయం సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది.
part2trend | రాజాసాబ్ సీక్వెల్..

ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది.. స్టార్ హీరో సినిమా అయినా.. యంగ్ హీరో సినిమా అయినా.. సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ది రాజాసాబ్ మూవీకి కూడా సీక్వెల్ ఉందని వార్తలు వచ్చాయి. ఇదే విషయం గురించి మేకర్స్ కూడా తప్పకుండా ఉంటుందని చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఫౌజీ కూడా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలతో పాటు సలార్ 2, కల్కి 2 చేయాల్సివుంది. అలాగే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ మూవీ ఉంది. ఇలా వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉంటే.. రాజాసాబ్ సీక్వెల్ ఎప్పుడు చేస్తాడు అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా మారింది.
part2trend | మారుతి ప్లాన్..

మారుతి డ్రీమ్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం. ఎప్పటి నుంచో చిరుతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. అయితే.. ఇప్పటి వరకు సెట్ కాలేదు. చిరంజీవి ఏమో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మన శంకర్ వరప్రసాద్ గారు.. సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక సమ్మర్ కి విశ్వంభర మూవీ విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత చిరు బాబీతో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు. అందుచేత చిరుతో మారుతి సినిమా ఓకే అయినా ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకనే మారుతి ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. నెక్ట్స్ ఏ సినిమా చేయాలి…? ఎవరితో సినిమా చేయాలి అనే విషయం పై ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు సమాచారం.
part2trend | ఐకాన్ స్టార్ తో మారుతి..

అల్లు అర్జున్, మారుతి.. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకనే.. ఈ కాంబో గురించి వార్తలు వస్తుంటాయి. ఇదే విషయం గురించి మారుతిని అడిగితే.. బన్నీ క్లోజ్ కాబట్టి.. ఏదో సినిమా చేసేయాలి అని లేదు. బన్నీ ఇమేజ్ కు తగ్గట్టుగా పవర్ ఫుల్ స్టోరీ రెడీ అయినప్పుడు నేనే వెళ్లి కథ చెబుతాను. ఖచ్చితంగా బన్నీతో ఎప్పటికైనా సినిమా చేస్తాను అని మారుతి చెబుతుంటారు. అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేసే మూవీ కోసం ఆల్రెడీ కథలు వింటున్నాడు. అలాగే నెక్ట్స్ ప్రాజెక్ట్ లాక్ అయ్యిందని టాక్. అందచేత బన్నీతో మారుతి సినిమా చేయాలన్నా.. కొంతకాలం వెయిట్ చేయకతప్పదు.. సో.. మారుతి నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే.. రాజాసాబ్ రిలీజ్ తర్వాత మారుతి నెక్ట్స్ మూవీ పై క్లారిటీ వస్తుందని టాక్.
