Paritala Ravindra | ఘన నివాళులు..

Paritala Ravindra | ఘన నివాళులు..

  • పేదల పక్షాన నిలిచిన ధీర నేత పరిటాల..
  • ఘనంగా మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి.

Paritala Ravindra | ఆంధ్రప్రభ విజయవాడ : తన చివరి శ్వాస వరకు నిరుపేదల పక్షాన నిలిచిన ధర నేత పరిటాల రవీంద్ర అనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నేప్రసాద్ వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పరిటాల రవీంద్ర చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గన్నే ప్రసాద్, సింహాద్రి కనకాచారీలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరిటాల రవీంద్ర పేద వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన నాయకుడని గుర్తు చేశారు. పేదలకు అండగా నిలవడమే కాకుండా కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించిన విశాల హృదయంతో కూడిన ప్రజానాయకుడని కొనియాడారు. పేద ప్రజల ఉన్నతి కోసం పరిటాల శ్రీరాములు, పరిటాల హరి, పరిటాల నారాయణమ్మలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని తెలిపారు.

Paritala Ravindra

జిల్లాలోని ప్రజలందరికీ పరిటాల రవి నిత్యం అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలను పంచుకున్న అన్నగా చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. తిరుగులేని తెలుగుదేశం పార్టీ సైనికుడిగా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, మాజీ సీఎం నందమూరి తారక రామారావుకి ప్రియ శిష్యుడిగా మన్ననలు పొందిన నాయకుడు పరిటాల రవీంద్ర అని పేర్కొన్నారు. నేడు నారా చంద్రబాబు నాయుడు పరిటాల రవీంద్ర కుటుంబ సభ్యులైన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లకు తెలుగుదేశం పార్టీలో సముచిత గుర్తింపు ఇచ్చి గౌరవిస్తున్నారని తెలిపారు. పరిటాల రవీంద్ర ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను పార్టీ నాయకులు, కార్యకర్తలు భుజాన వేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంటి శివరాం ప్రసాద్ గౌడ్, బొల్లా వెంకటేశ్వరరావు గౌడ్, పామర్తి కిషోర్ బాబు, కోడూరు ఆంజనేయ వాసు, బత్తుల దుర్గారావు, కోనేరు రాజేష్, పొన్నం రవికుమార్, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, గొల్లపూడి నాగేశ్వరరావు, ప్రేమ్ చంద్, ఈడుపుగంటి అజయ్, మల్లెల విజయ్ కుమార్, గుమ్మడి వెంకటేశ్వరరావు, లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply