బీజేపీ 9వ వార్డులో విస్తృత ప్రచారం

బీజేపీ 9వ వార్డులో విస్తృత ప్రచారం
- సమస్యలకు శాశ్వత పరిష్కారం
- బిజెపి 9వ వార్డు అభ్యర్థి బెజ్జంకి పూర్ణ చారి
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 9వ వార్డ్ లో బిజెపి పార్టీ బలపరిచిన బెజ్జంకి పూర్ణాచారి విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఓటర్లను కలుస్తూ వార్డు సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని బిజెపి 9వ వార్డు అభ్యర్థి బెజ్జంకి పూర్ణ చారి ఓటర్లకు కోరారు. పట్టణంలోని 9వ వార్డులో బిజెపి పార్టీ అభ్యర్థి బెజ్జంకి పూర్ణ చారి ఆధ్వర్యంలో ఇంటింటి విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస కాలనీ, మమత నగర్ వరద ముంపు నుండి తప్పించేందుకు కృషి చేస్తానన్నారు. పూర్వ మాజీ కౌన్సిలర్ అనుభవంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వార్డులో ఇంటింటా పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఓటర్ల మద్దతు కోరారు. వార్డులోని ఓటర్లకు ఎల్లవేళల సేవలు చేస్తానని అభ్యర్థి బెజ్జంకి పూర్ణ చారి ఓటర్లను కోరారు. అభ్యర్థి వెంట బిజెపి నాయకులు, నాయకురాళ్లు సిరికొండ కవిత వరలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
