పాన్ డబ్బాలపై పోలీసుల మెరుపు దాడులు

పాన్ డబ్బాలపై పోలీసుల మెరుపు దాడులు
సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని పాన్ డబ్బలపై పోలీసుల మెరుపు దాడులు చేసి నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై వంశీ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామాల్లో స్కూల్స్, కాలేజెస్ కి సమీపంలో ఉన్న పాన్ షాపులు, కిరాణా స్టోర్స్ పై తనిఖీలు చేసి తిమ్మాపూర్ గ్రామంలో స్కూల్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో సిగరెట్లు అమ్ముతున్న తాటి మొగిలి పై సిఓటిపిఏ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అదేవిధంగా పల్లార్గూడ గ్రామంలోని ఎండి అక్రమ్ పాషా పోడేటి బాబు ఎల్గూరు రంగంపేటకు చెందిన బోనాల శ్రీనివాస పై కేసులు నమోదు చేశారని తెలిపారు. స్కూల్స్, కాలేజ్ సమీపంలో ఎటువంటి సిగరెట్లు, ఉత్పత్తులు అమ్మకూడదని ఎస్సై వంశీకృష్ణ హెచ్చరించారు. తనిఖీలు నిర్వహించిన వారిలో ఎస్సై వంశీకృష్ణ తో పాటు కానిస్టేబుళ్లు కిషోర్, శంకర్, నవీన్ తదితరులు ఉన్నారు.
