కార్యాలయంలో భయాందోళన
గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఎంపీడీవో(MPDO) కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. గట్టుప్పల(Gattuppala) గ్రామానికి చెందిన గుండ్లపల్లి శ్రీశైలం, తండ్రి నారయ్య(Narayya) మద్యం సేవించి కార్యాలయానికి వచ్చి అక్కడ విధుల్లో ఉన్నఅధికారులను భయాందోళనకు గురి చేశాడు.
విధులు నిర్వహిస్తున్న అధికారుల(officials)ను రాయితో కొడతానని బెదిరించాడు. అనంతరం అదే రాయితో ఎంపీడీవో కార్యాలయంలోని రెండు కంప్యూటర్లు(computers), రెండు సీపీయులు, ఒక ప్రింటర్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో కార్యాలయంలో భయం నెలకొంది. వెంటనే సిబ్బంది స్థానిక పోలీసుల(police)కు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.