మచిలీపట్నంలో పాండురంగడి ఉత్సవాలు..

మచిలీపట్నంలో పాండురంగడి ఉత్సవాలు..

మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు ప్రత్యేక పూజలు

( ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి) : మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుండి ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా స్వామి వారి ఉత్సవాలు జరగనున్నాయి. సతీసమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను మంత్రి కొల్లు రవీంద్ర సమర్పించారు. మేళతాళాలు, పూర్ణ కుంభంతో మంత్రి కొల్లు రవీంద్రకు ఉత్సవ కమిటీ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి దంపతులతో పాటు స్వామి వారిని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ తదితరులు దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పాండురంగడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. నవంబర్ 2న స్వామి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నామని తెలిపారు. 3న నాగులేరు కాలువలో తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 5వ తేదీన జరిగే కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు కూడా విస్తృత ఏర్పాట్లు చేశామని, భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు.

Leave a Reply