పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు..

  • నేడు రెండో విడత పల్లెపోరు
  • 140 గ్రామాల్లో ఎన్నికలు
  • ఓటు వినియోగించుకొనున్న 2,02,716 మంది
  • ఎన్నికలకు సర్వం సిద్ధం
  • ఆంధ్రప్రభ తో అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు.. జిల్లాలో ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. భువనగిరి నియోజకవర్గంలో 4 మండలాలు, నకిరకల్ నియోజక వర్గంలోని ఒక మండలంలో ఆదివారం రెండో విడతకు పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో ఎన్నికలను పాదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఎ.భాస్కర్‌రావు తెలిపారు. శనివారం పంచాయితీ ఎన్నికలపై ఆంధ్రప్రభ తో కాసేపు ముచ్చటించారు..

రెండవ విడతలో 5 మండలాల్లో ఎన్నికలు..

రెండువ విడతలోని ఐదు మండలాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. భువనగిరి నియోజక వర్గంలోని 4 మండలాలు భువనగిరి, బీబీనగర్, భూధాన్ పోచంపల్లి, వలిగొండ పరిధిలో 118 గ్రామాలకు, నకిరేకల్ నియోజక వర్గంలోని రామన్నపేట మండలంలోని 22 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.. 150సర్పంచ్‌లకు గాను 10 గ్రామ పంచాయితీ సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యాయయి. మొత్తంగా 140 జీపీలు, 1332 వార్డులకు గాను 171 వార్డులు ఏకగ్రీవం కాగా 1161 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఓటరు స్లిప్ ల పంపిణీ పూర్తి

ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తయ్యింది. ఓటరు జాబితా ప్రకారం బీఎల్ ఓలు, పంచాయతీ. కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్లు పంపిణీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాం. ఇప్పటికే వారంతా మండల పరిషత్ కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడవ విడత ఎన్నికలు ముగిసే వరకు రోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలుంటాయి.

ఉదయం 7 నుంచి పోలింగ్…

ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్ కేంద్రం ఉంటుంది..ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది.బ్యాలెట్‌ బాక్స్‌ పద్ధతిలో ఎన్నికలు ఉంటాయి. సర్పంచ్ కు గులాబీ కలర్ బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఎన్నికల సంఘం కేటాయించిది. ఓట్ల లెక్కింపు 2 గంటల నుంచి ప్రారంభిస్తాం. అదే రోజు సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడించగానే ఉప సర్పంచ్ ను వార్డుసభ్యులు ఎన్నుకుంటారు.పోలింగ్‌ శాతం పెంచేందుకు, ఓటర్లలో చైతన్యం పెంచేందుకు అన్ని రకాల చర్య లు చేపట్టామన్నారు. గత పంచాయతీ ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్‌ శాతం మరింత పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఓటు వినియోగానికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.

విధుల్లో 3 వేల మందికి పైగా సిబ్బంది…

రెండవ విడత ఎన్నికల కోసం విధుల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను 3వేల మందికి పైగా నియమించాం. 28 మంది జోనల్ అధికారులు, 145 మంది స్టేజ్ 2 అధికారులు, 1296 మంది పివోలు, 1572 మంది ఓపివో లు విధుల్లో ఉండనున్నారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన 52 రకాల సామగ్రిని ఇప్పటికే మండల కేంద్రాలకు చేరవసి. డిస్ట్రిబ్యూషన్ సెం టర్ ద్వారా సిబ్బందికి అందజేశాం. పోలీసు బందోబస్తు, జోనల్ అధికారుల పర్యవేక్షణలో బస్సులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి.

2,02,716 మంది ఓటర్లు..

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడతలో 2,02,716 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందు లో 1,00,801 పురుషులు,1,01,915 మహిళలు ఉన్నారు..పోచంపల్లి లో 26,921, భువనగిరి లో 38,306, బీబీనగర్ 41,154, వలిగొండ 52,431, రామన్నపేట లో 43,904 మంది ఓటర్లు ఉన్నారు.

Leave a Reply